//single page style gallary page

Nara Lokesh Counter to Goutham Reddy

Category : state politics

Click here to read this article in Telugu

వైసీపీ మంత్రికి నారా లోకేశ్ కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని అందుకొని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేనంతగా ఓటమిని చవిచూసింది. ఇకపోతే వైసీపీ, టీడీపీ మధ్య రోజు- రోజుకు మాటల యుద్ధం పెరిగిపోతూ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా నారా లోకేశ్, వైసీపీ మంత్రి గౌతమ్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ విసిరారు. యథా సీఎం, తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ అసలు ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు. మంత్రి గౌతమ్ రెడ్డి, రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఆరోపించారు.

"బాధ్యతారహితంగా ఆరోపణ చేసేముందు కనీసం ఒక రెండు నిముషాలు బుర్ర పెడితే సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరికేది. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థ. సంస్థ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్లు కూడా విడుదల చేసింది చూడండి". "మంత్రిగారు ఈ సంస్థనే ఫేక్ కంపెనీ అంటున్నారు. ఫేక్ కంపెనీ ఎక్కడైనా ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ లు రిలీజ్ చేస్తుందా? ఇది కూడా తెలీని వారు అక్రమాలపై లోతుగా విచారణ చేస్తారంట. మంత్రిగారూ! ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే మీ అధినేత నేర చరిత్రను ఒకసారి చదువుకోండి " అంటూ గౌతమ్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు నారా లోకేశ్.

YSRP chief YS Jagan has taken over as the chief minister of the AP after the YCP won the general election in Andhra Pradesh this time. While the ruling party TDP has aimed to win, the elections have suffered an unprecedented defeat. Otherwise, the day-to-day battle between the YCP and TDP is known to be on the rise. But now, Nara Lokesh and YCP leader Goutam Reddy have thrown a counterattack. The truth of the rumors that the CM and the Minister said that no one is muddy on the TDP, but they have no knowledge of the actual allegations of the YCP. Minister Gautam Reddy alleges that TDP conspired to create a fake company in the name of Reliance Company and hit 1,000 acres.

"All information is retrieved on the Internet for at least two minutes before an irresponsible allegation is made. Reliance Prolific Traders Private Limited is a subsidiary of Reliance Industries. The company has also released financial statements." "Fake company is saying Fake company. Fake company releases financial statements anywhere? This is also a deeper investigation into the irregularities.