Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Category : politics business

తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరు ఎదురు చూస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం గురించే. ఆమె ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా జరిగిన ఒక సంఘటన ఆమెకు మరింత ఇమేజ్ తెచ్చి పెట్టింది. తిత్లీ తుఫాన్ బాధితులకు హెరిటేజ్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

12 లక్షల పాల, మంచి నీళ్ళ ప్యాకెట్ లను అందించింది. అలాగే సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున హెరిటేజ్ టీం పాల్గొన్నారు. ఇక దసరా రోజు నారా బ్రాహ్మణి 66 లక్షల చెక్ ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆమె అందించడంతో ఆమె ఇమేజ్ మరింతగా పెంచేసింది. సింహం కడుపున సింహమే పుట్టింది అంటూ తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తే టీడిపికి ఇంకా మైలేజ్ తీసుకోస్తాయని అంటున్నారు.