//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రాహ్మణి సర్వేతో షాక్ తిన్న లోకేష్...?

Category : politics

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఏపీని అభివృద్ధి చేయడానికి చాల కష్టపడుతున్నారు. ఒక ప్రక్క రాష్ట్రంలో విదేశీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించి ఉద్యోగ అవకాశాలు కలిపిస్తూనే, మరో ప్రక్క మిగిలిన నిరుద్యోగ యువతకి ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతొ నిరుద్యోగ భృతి క్రింద ప్రతి నెల 1000 రూపాయలు అందచేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా లో పర్యటించి అక్కడి కంపెనీలలు ఒప్పించినా సంగతి మనకి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా చైనాలో పలు కంపెనీలతో చర్చలు జరిపి వారిని ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లోకేష్ వారిని ఏమి మాయచేసావో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అని రాజకీయనాయకులు షాక్ అవుతున్నారు. ఇలా రాష్ట్రము కోసం కష్టపడుతున్న లోకేష్ ఓ సర్వే చూసి షాక్ అయ్యారంట.

ఆ సర్వే ప్రకారం, తండ్రికి తగ్గ కొడుకుగా లోకేష్ చాల చురుకుగా అభివృద్ధిపనులలో పాల్గొంటున్నారని అదేవిధంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలు వారు పడే కష్టాలను తెలుసుకుంటున్నారని ఈ సర్వే తెలియచేస్తుంది. లోకేష్ పాలనపై జనం చాల తృప్తి చెందారని సమాచారం. అదే విధంగా ఈ సారి ఎలక్షన్స్ లో లోకేష్ ఎక్కడ నుండి పోటీచేసిన గెలుస్తాడని ఈ సర్వే చెపుతుందంట. ఈ సర్వేపై చంద్రబాబు కూడా చాల సంతోషంగా ఉన్నాడంటా. అయితే ఈ సర్వే చేయించింది లోకేష్ భార్య బ్రాహ్మణి అని, తన భర్త పాలనా ఎలా ఉందొ తెలుసుకోవాలనే ఉద్దశ్యంతో ఈ సర్వే చేయించిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

Related News