//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'కథానాయకుడు'లో నిజం కనిపించింది... నారా బ్రాహ్మణి

Category : movies

మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా విడుదల అయినా సంగతి తెలిసిందే. అయితే సినిమా చూడటానికి బాలయ్య,తన కుటుంబ సభ్యులు ఓ థియేటర్ కు వచ్చారు. ఈ సందర్భలో మీడియాతో నారా బ్రహ్మణీ మాట్లాడుతూ 'నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాన్న గారు అచ్చం తాతగారిలా ఉన్నారు. తాతగారు ఎప్పుడూ ప్రజాసేవ గురించి ఆలోచించేవారు, కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపారు. మా నాయనమ్మ బసవతారకం గారు నేను పుట్టకముందే చనిపోయారు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. ఈ సినిమా సినిమాల కాకుండా నిజం స్టోరీ చూసినట్టు అనిపించింది అని చెప్పారు.

అదే థియేటర్ లో ఉన్న సుహాసిని మీడియాతో మాట్లాడుతూ 'తమ తాతయ్య ఎన్టీఆర్ గురించి తెలియని వాస్తవాలను ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ ద్వారా తెలుసుకున్నానని' ‘ఈ సినిమా బాగా చిత్రీకరించారు. నాన్నగారి పాత్రలో కల్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారు. క్రిష్ గారి డైరెక్షన్ అద్భుతం, అమోఘం. ఈ చిత్రం రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నాను. రేపు రిలీజ్ అయినా థియేటర్ కు వెళ్లి చూడాలనుంది అని అన్నారు.