//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ మహానాయకుడు పై "పూరి,నారా బ్రహ్మణి,తమ్మారెడ్డి" మాటల్లో...!

Category : movies

తెలుగు చిత్ర సీమలోనే మకుటం లేని మహారాజు గా,తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వరకు తెలిసేలా చాటి చెప్పిన మహానాయడు. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ నేడు విడుదల కావడం జరిగింది. ఈ సినిమా చుసిన పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూసిన తరువాత ఎంతో భావోద్వేగానికి గురై తమ మనసులోని మాటలను మీడియా తో పంచుకున్నారు.ఇలా తనకు 'కథానాయకుడు' సినిమా కంటే 'మహానాయకుడు' చిత్రం చాలా ఎక్కువ నచ్చిందని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు.

బసవతారకంగారి గురించి చెప్పే డైలాగ్ విని తాను ఏడ్చానని. అసెంబ్లీలో ఎన్టీఆర్ కు జరిగిన సన్నివేశం చూసి వెక్కవెక్కి ఏడ్చానని చెప్పారు. ఈ మధ్యకాలంలో తాను కంటతడి పెట్టిన సందర్భం ఇదేనని పూరి చెప్పారు.ఇదే సందర్భంగా మరో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ... మహానాయకుడు' సినిమా చాలా అద్భుతంగా ఉందని... సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని మళ్లీ రామారావుగారిని చూసిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు.

ఈ సినిమా చూసిన తరువాత నారా బ్రహ్మణి స్పందిస్తూ .. తెలుగు చిత్రపరిశ్రమకి తాతగారు ఎంత గుర్తింపును తీసుకువచ్చారో 'కథానాయకుడు' సినిమాలో చూశాము. ఆ సినిమాకి మించిన స్థాయిలో 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు.తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తోంది.

మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నీ, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రూపొందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా చూడాలి. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా, నా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

Related News