//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాని పై శ్రీ రెడ్డి ధారుణ‌మైన కామెంట్స్‌.. నాని భార్య సంచ‌ల‌న ట్వీట్..!

Category : movies

టాలీవుడ్ ప్ర‌ముఖుల పై వ‌రుస‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌తిరోజు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న శ్రీరెడ్డి కొద్ది రోజులుగా నానిని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ 2లో త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినా నాని వ‌ల్ల మంచి అవ‌కావాన్ని కోల్పోయాన‌ని శ్రీరెడ్డి రెండు రోజులుగా నానీ పై ధారుణంగా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స‌హ‌నం కోల్పోయిన నాని.. శ్రీరెడ్డికి లీగ‌ల్ నోటీసులు పంపించాడు.స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుందని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన శ్రీరెడ్డి- నానిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది.

అయితే ఈ నేప‌ధ్యంలో శ్రీరెడ్డి - నాని పై చేస్తున్న ధారుణ‌మైన కామెంట్స్ పై తాజాగా నాని శ్రీమ‌తి అంజనా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. సినీ ప‌రిశ్ర‌మ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. ప‌బ్లిసిటీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న కొందరు పరిశ్రమలోకి వ‌స్తుండ‌డం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ు. అయితే త‌మ వ్య‌క్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి వారు ఎలా సిద్ధ‌ప‌డ‌తారో, వారికే తెలియాలి అంటూ శ్రీరెడ్డిని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేయ‌డ‌మే కాకుండా.. దానికి నాని లీగ‌ల్‌గా కేసు పెడుతున్నట్టు పెట్టిన పోస్టును కూడా అటాచ్ చేసింది. మరి అంజ‌నా ట్వీట్ పై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలని స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు.