//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాని..!

Category : movies

హ్యాపీడేస్ సినిమాతో యూత్ ఆడియెన్స్ పల్స్ పట్టేసిన క్రేజీ డైరక్టర్ శేఖర్ కమ్ముల కొద్దిపాటి గ్యాప్ తో లాస్ట్ ఇయర్ ఫిదా హిట్ అందుకున్నాడు. ఈ సినిమా శేఖర్ కమ్ముల కెరియర్ ను మళ్లీ హిట్ ట్రాక్ లో పడేసింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన నెక్ష్ట్ సినిమా ఎనౌన్స్ చేయని కమ్ముల శేఖర్ మీద ప్రెజర్ పెరిగింది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల నానితో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి ఈమధ్యనే కథ వినిపించాడట శేఖర్ కమ్ముల. అనామిక తర్వాత గ్యాప్ తీసుకుని ఫిదాతో సత్తా చాటిన శేఖర్ కమ్ముల నాని మార్క్ ఎంటర్టైనింగ్ కథతో వచ్చాడట.

ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దిల్ రాజు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓ పక్క క్లాసిక్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా సూపర్ హిట్లు కొడుతున్న నాని మరో పక్క ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఇక ఆ సినిమా రేంజ్ ఏంటన్నది అంచనాలకే అందట్లేదు.

మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాని మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగార్జునతో కూడా మల్టీస్టారర్ షురూ చేశాడు. మరి ఈ రెండు సినిమాల తర్వాత నాని కమ్ముల మూవీ ఉంటుందని చెప్పొచ్చు.