//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

# నాని 24 కి ముహూర్తం ఖరారు

Category : movies

నాని ప్రస్తుతం మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే సినిమాల నటిస్తున్నాడు. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ. ఇందులో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. మనం ఊహించని అనూహ్య మలుపులతో ఈ కథ ఆశ్చర్య పరుస్తుందట.

ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నాని. నానికి ఇది 24 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు మూవీ టీం. అందులో నాని , విక్రమ్ ఒక గోడ పై కూర్చుని మాట్లాడు కుంటున్నారు. సవ్యసాచి , అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలతో పరాజయాలను చవి చూసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ పోస్టర్ లో ఫిబ్రవరి 19 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది అనే విషయాన్నీ కూడా తెలియ చేసారు. విక్రమ్ కే కుమార్ సినిమా అంటే రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. 13B , 24 , మనం లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం. నాని కూడా ఈ సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేక సినిమాగా నిలవబోతుంది అని భావిస్తున్నాడట. సినిమా కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related News