ఐన్ఫోసిస్ ఛైర్మన్‌గా నందన్ నీలేకని నియామకం అయ్యారు. కాగా ఇన్ఫోసిస్ బోర్డు నుంచి ఇటీవలే ఆర్.శేషసాయి, విశాల్ సిక్కి, రవి వెంకటేశన్ లు వైదొలగిన విషయం విధితమే. ఈనేపధ్యంలో ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా నందన్ నీలేకనిను నియమించారు.
ఇన్ఫీ సీఎండీ గా విశాల్ సిక్కా అనూహ్య రాజీనామాతో బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.నీలేకనిని కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా, నాన్ ఎగ్జిక్యూటీవ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా నియమించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ గురువారం సాయంత్రం రెగ్యూలేటరీకి చేసిన ఫైలింగ్‌లో తెలిపింది.
కంపెనీ వ్యవస్థాపకులు ఎన్.ఆర్ నారాయణ మూర్తి తర్వాత 2002 ఏప్రిల్‌లో నీలేకని సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2009 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియాకు (ఆధార్) బాధ్యుడిగా వ్యవహరించారు. ఆయన దక్షిణ బెంగళూరు నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫీలో నీలేకనికి 2.29 శాతం వాటాలు ఉన్నాయి.
"ఇన్ఫోసిస్‌కు తిరిగి రావడం నాకు సంతోషానిస్తోంది. నేటి నుంచి నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాను. నా సహచరులతో కలిసి భవిష్యత్తు కోసం పనిచేస్తాను. మా ఖాతాదారులకు, వాటాదారులకు, ఉద్యోగులకు, మంచి ఫలితాలను ఇవ్వడమే లక్ష్యం" అని నీలేకని పేర్కొన్నారు.