//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడినుండేనా కళ్యాణ్ రామ్ పోటీ .. ఇక వార్ వన్ సైడే....!

Category : politics movies

తెలంగాణ లో ప్రస్తుతం రాజకీయం చాలా రంజుగా సాగుతుంది . ఊహించని విధంగా తెలంగాణ సీఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్లడం తో రాష్ట్రం లో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి . సీఎం కెసిఆర్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేయటం , ఎన్నికలకి శంఖారావాన్ని పూరించటం అన్ని చక చక జరిగిపోయాయి . కెసిఆర్ మరో అడుగు ముందుకేసి 105 మంది తో తోలి జాబితాని కూడా విడుదల చేసాడు .ఇందులో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యే లు ఉండటం తెరాస కి కలిసి వచ్చే అంశం .

దీనితో ఈ సారి తెలంగాణ లో కెసిఆర్ ఆటలని ఎలాగైనా అరికట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలు అన్ని కలిసి ఒక మహా కుటుమని ఏర్పాటు చేసి కెసిఆర్ పై యుద్దానికి సిద్ధమయ్యారు . కాంగ్రెస్ , టీడీపీ పొత్తుల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్న స్థానాల్లో మాకే అవకాశం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది . దీనితో ఈ స్థానాల్లో టీడీపీ బలా బలాలని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు .

ఈ నియోజక వర్గాల్లో టీడీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న శేరి లింగంపల్లి నియోజకవర్గాన్ని వదులుకోకూడదు అని టీడీపీ అగ్ర నాయకత్వం ఉంది . ఇదే నియోజక వర్గం లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 70 వేల పై చిలుకు ఓట్ల తో గెలుపొందాడు . దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయుడు అయిన కల్యాణ రామ్ ని అక్కడ నుండి పోటీ చేపించాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు , హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా టీడీపీ నేతలతో కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడాడు అని సమాచారం , ఒకవేళ కళ్యాణ్ రామ్ కనుక ఎన్నికల బరిలో ఉంటె జూ .ఎన్టీఆర్ ప్రచారానికి రావచ్చు అనే సమాచారం అందుతుంది . చూడాలి మరి అన్న కోసం ఎన్టీఆర్ మళ్ళీ ఎన్నికల ప్రచారానికి దిగుతాడో ...లేదో ....

Related News