//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయవంతంగా పూర్తయిన బాలకృష్ణ సర్జరీ

Category : politics

నందమూరి బాలకృష్ణ....తన డైలాగ్స్ తో నటన తో ఎంతో మందిని సంపాదించుకున్నాడు మన బాలయ్య.తన 43 ఏళ్ళ సినీ జీవితం లో ఎన్నో విజయాలు,ఎన్నో నంది అవార్డ్స్ సంపాదించాడు మన బాలయ్య. అలాంటి బాలయ్య ఒక మూవీ ని ఒప్పుకున్నాడంటే తన ఆరోగ్య విషయం ని కూడా పట్టించుకోకుండా కష్టపడతాడు. అలాంటి చిన్న సర్జరీ ఒకటి ఈ రోజు జరిగింది.

అదేంటంటే..గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. అప్పటి నుంచే ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాథ‌మిక చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయ‌న జైసింహా చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండటంతో స‌ర్జ‌రీచేయించుకోలేక‌పోయారు.

అయితే వరుస షూటింగ్‌లతో ఆయన గాయం,నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌యింది.దీంతో స‌ర్జ‌రీ అనివార్య‌మని వైద్యులు తేల్చిచెప్పడంతో శ‌నివారం ఉద‌యం బాల‌కృష్ణ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్లో చేరారు. పలు వైద్యపరీక్షలు జరిపిన అనంతరం క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి,డాక్టర్ ఆశిష్ బాబుల్కార్(పూణే)లు స‌ర్జ‌రీ చేశారు.దాదాపు గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు.

Related News