Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వై.ఎస్.ఆర్ గుర్తు చేస్తున్న నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి.....తన గెలుపు కు స్ఫూర్తిగా ఆయనేనట.

Category : politics

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తన దైన ముద్ర వేసుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఈయన సొంతం.అంతే కాదు ఈయన ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన అనుభవం ప్రజా బలం వెంకట్ రెడ్డి సొంతం.కాకపోతే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతి లో ఓడిపోయిన ఆయన.ఆ ఓటమి భారం నుంచి త్వరగానే కోలుకుని రీసెంట్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించి అదే అధికార పార్టీ అభ్యర్థి మాజీ ఎంపి పైళ్ళ శేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించి.తనకు ఆ జిల్లా రాజకీయాల్లో తిరుగులేదని నిరూపించారు.

ఇది ఇలా ఉంటే సొంత పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఇమేజ్ సంపాదించుకున్న వెంకట్ రెడ్డి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని మరో సారి నిరూపించారు. ఎప్పటికప్పుడు రాజకీయ సవాళ్లకు స్పందించే దమ్మున్న నేతగా భువనగిరి ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకునీ తన సత్తా ఏమిటో చెప్పకనే చెప్పేశారు.ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన తన గెలుపుకు స్ఫూర్తి గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి లు కారణంగా పేర్కొనడం.తన గెలుపును సైతం వారి ఖాతాలో వేయటం ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై పోరాడిన వైఎస్ తో పాటు..

ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడతానని చెప్పుకు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత ఆ పదవి పై ఆయన ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి పదవి మీద ఆశ లేదని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన నాటి నుంచి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య మొదలు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ వరకూ ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తు వచ్చిన ఆయన.. ఆ పదవిని చేపట్టాలన్న ఆశలో ఉన్నప్పటికీ . .... ఆయన కోరిక తీరాలంటే మాత్రం పార్టీ అధినాయకత్వం ఆయన కోరికను మన్నించని పరిస్థితి. తాజాగా ఎంపీగా గెలిచి మరోసారి తన సత్తాను చాటిన కోమటిరెడ్డి కోరికను ఈసారైనా కాంగ్రెస్ పార్టీ మన్నిస్తుందా....లేదా అన్నది చూడాలి మరి.