//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెసా ? భాజపా నా ?

Category : national movies

తమిళ నాడు రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తమౌతున్న కారణంగా, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని ప్రచారం ఫుల్ గా సాగుతుంది.అయన రాజకీల్లోకి వస్తే భాజపా లో కి రావాలని ప్రధాని మోదీ అప్లికేషన్ పెట్టుకున్నారు. తాజాగా రజనీతో కాంగ్రెస్‌ జాతీయ నాయకురాలు నగ్మా భేటీ కావడం మరోమారు ‘తలైవా’ రాజకీయ అరంగేట్రం వ్యవహారంపై చర్చకు దారితీసింది.రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం పై భాజపా ,కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. అయితే ఇంతకి ఆయనకి రాజకీయాలంటే మక్కువ వుందా లేదా ? అనేది చూస్తే ,గతం లో అంటే 1996 ఎన్నికల్లో జయలలితకు ఓటేస్తే రాష్ట్రంలో మంచి అనేది మిగలద’నే వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ప్రచారం సాగింది.అపట్లో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేశాయి.అప్పుడు ఆమె ఓటమి పాలయ్యారు.ఆ తరువాత కావేరి జలాల గురించి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తరువాత రాజకీయ పరిస్థితుల్లో చాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పూర్తిగా మౌనం వహించారు.ఇదే సమయంలో ఆయన స్నేహితుడైన అమితాబచ్చన్‌ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లవద్దని రజనీకి సలహా కూడా ఇచ్చారు.మరి ఇప్పుడు రజనీ నోరు విప్పి చెప్పాల్సిన టైం వచ్చింది,తన నిర్ణయం ఏంటన్నది.