Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో బ్యాటింగ్ కి దిగిన నాగార్జున...... టీజర్ లోనే చుక్కలు చూపించిన 'మన్మథుడు -2’ .

Category : movies

అక్కినేని నాగార్జున సినిమా కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీ గా చెప్పుకునే సినిమా మన్మథుడు.సరిగ్గా 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నాగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దగ్గరైన అభి పాత్ర ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో నాగ్ కి జంటగా సోనాలి బిందే నటన కూడా అద్భుతం అనే చెప్పాలి. సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కామీనేషన్ లో వచ్చిన ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అంతేకాదు ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది కూడా అందుకుంది. అలాంటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సారి నాగార్జున హీరోగా ‘మన్మథుడు -2’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను విడుదల చేసారు ఈ చిత్ర బృందం.ఈ టీజర్‌ లో నాగ్ నీ చూస్తుంటే మరి యంగ్ గా కుర్ర హీరోలకు మరో పదేళ్ల పాటు పోటినించే విధంగా ఆయన లుక్స్ , ఫిట్నెస్ ఉండడం విశేషం. అందుకోసం ఆయన ఇప్పటికీ జిమ్ లో వర్కౌట్ చేయడం చూస్తూనే ఉన్నాం... అంతలా లేట్ వయసులో హాట్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నారు నాగ్.ఇక టీజర్ లో చూస్తే.... లేట్ వయసులో పెళ్లి కోసం ఆరాట పడే హీరోలా నాగ్ క్యారెక్టర్ సూపర్ అనే చెప్పాలి.నీకు షటర్లు మూసేసి దుకాణం సద్దేసే చేసే టైమ్ వచ్చేసింది. ఇంత అందంగా పుట్టి ఏం ప్రయేజనం ఉండదుగా అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ టీజర్. మరో ఎండ్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ....ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ మొలుస్తాందా అనే పంచ్ తో పాత సునీల్ కామెడీ గుర్తుకు తెస్తోంది.మరోవైపు సీనియర్ నటి లక్ష్మీ .నాగ్ తో మాట్లాడుతూ నీవు వర్జినా అంటే ఔను అంటూ నాగార్జున చెప్పడం.అదే సమయంలో నాగార్జున వెర్రిగా నవ్వుతూ కట్ చేస్తే..

ముగ్గురు ఫారిన్ భామలతో లిప్‌లాక్ సీన్స్‌లో దర్శనం ఇవ్వడం. చూస్తే నాగ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిదే. మామూలుగా టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మోస్ట్ రొమాంటిక్ హీరో నాగర్జున అలాంటి నాగ్ మరో మారు తన ప్రతాపం చూపించాడు. లిప్ లాక్ సీన్స్ లో ఇరగదీశాడు.అంతేకాదు పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో ఇపుడు బ్యాటింగ్ ఏంట్రా అంటూ రావు రమేష్‌తో చెప్పిన డైలాగులు సెకండ్ లెవల్‌లో ఉంటుంది. ఈ రకంగా టీజర్‌తోనే ‘మన్మథుడు 2’ పిచ్చ హైప్ వచ్చేసింది. అలాగే ఈ టీజర్ లో వచ్చే డబుల్ మీనింగ్‌ డైలాగ్స్ కూడా లో ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి ముదురు వయసు మన్మథుడుగా నాగార్జున పిల్ల కోసం పడే తిప్పలు కడుపుబ్బ కామెడీని తెప్పించాయి. చివర్లో ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్ అంటూ నాగార్జున చివర్లో డైలాగు చెబుతూ తన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పించడం బాగుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ మాత్రం ఈ టీజర్ లో ఎక్కడ కనిపించక పోవడం విశేషం.అలాగే ఈ సినిమా ఆగస్ట్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News