//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉగాది రోజున ప్రారంభం కానున్న నాగార్జున నాని మల్టీ స్టారర్......!

Category : movies

టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లో అగ్ర హీరోలు మల్టీ స్టార్ సినిమాలల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున, ఈ మధ్య కాలం లో ఎవరికి సాధ్యం కానీ వరుస హిట్ లతో దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఈ మూవీ రానున్నది.

ఈ సినిమాను భారీ హంగులతో, టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అశ్వినిదత్ వైజయంతి బ్యానర్ ఫై నిర్మించనున్నారు. ఈ సినిమా కు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా వచ్చే ఉగాది పండుగ నాడు సెట్స్ ఫైకి వెళ్లనున్నది.

నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ వైజయంతి బ్యానర్ నుండి వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచాయని చెప్పారు. అలాగే ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు.

అమెరికాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్ జరుగుతుంది. ఈ సెట్టింగ్ లో మణిశర్మ గారు పాల్గొంటున్నారు. అక్కడే సినిమాకు సంభందించిన మూడు పాటలకి సంభందించిన సిట్టింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసాము , అవి అన్ని ఘన విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాకూడా భారీ విజయాన్ని అందుకొని మా బ్యానర్ కి మంచి పేరు తీసుకు వస్తుందని చెప్పారు.

డైరెక్టర్ మాట్లాడుతూ నాగార్జున, నాని వంటి స్టార్లతో , వైజయంతి బ్యానర్ లో సినిమా చేయడం నాకు చాల ఆనందంగా వుంది అని చెప్పారు.