//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

Category : politics movies

ఎన్నిక‌లు వేడెక్క‌డంతో ఆ ప్ర‌భావం ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీపై ప‌డుతుంది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కాంగ్రెస్‌లో చేరితే, హాస్య న‌టుడు పృథ్వీ వైసీపీలో చేరారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని, జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కావ‌డంతో వైసీపీలో చేరుతాడ‌న్న వార్త కొన్నిరోజులుగా వినిపిస్తుంది.Nagarjuna Gives clarity About Political Entry

2019 ఎన్నిక‌ల్లో నాగార్జున వైసీపీలో చేరుతార‌న్న వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని తెలిసిపోయింది. ఈ విష‌య‌మై నాగ్‌ను డైరెక్ట్‌ గా అడిగితే, అస‌లు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశ‌మే లేద‌ని తేల్చి చెప్పారు. అధికారం, హోదా కు దూరంగా ఉంటాన‌న్నారు. త‌న పిల్ల‌ల‌పై దృష్టి త‌ప్ప‌.. మ‌రో ఉద్దేశ‌మే లేద‌న్నాడు నాగ్‌. Nagarjuna Gives clarity About Political Entry

నాగార్జున రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే ఎప్పుడో సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసేవాడు. అలా కాకుండా, వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు నాగ్‌. నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి న‌టిస్తున్న సినిమా ఈ నెల 27న రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఆ త‌రువాత చేయ‌బోయే సినిమాల‌పై శ్ర‌ద్ధ‌పెట్టాడు నాగార్జున‌. చి.ల‌.సౌ తీసిన రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు - 2 సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఉంది. అదే కాకుండా, సోగ్గాడే చిన్ని నాయ‌న సీక్వెల్ బంగార్రాజు క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో క‌ళ్యాణ్ కృష్ణ ఉన్నాడు. ఇన్ని సినిమాల‌ను చేతిలో పెట్టుకున్న నాగార్జున రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. Nagarjuna Gives clarity About Political Entry