//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాతగా మారిన నాగార్జున...ఎందుకో?

Category : movies

మన్మదుడిగా మనందరికీ తెలిసిన నాగ్..ఇప్పుడు కొత్త అవతారంలో అందరిని అలరిస్తున్నారు.యవ్వనం కోసం చూసే పాత్రలను వదిలేసి ముసలి అవతారం ఎందుకు ఎత్తాడో అని అందరు అవాక్కవుతున్నారు..

ఇదేదో కొత్త సినిమా కోసం అనుకుంటే అది పొరపాటే,కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా నాగ్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే..దానికోసం ప్రత్యేకంగా ఆ అవతారం ఎత్తారంట.1 . 30 నిమిషాల ఈ అవతారంలో నిజాయితీ వృద్ధుడు గా కనిపిస్తారు. మనువరాలితో బ్యాంకు వెళ్లి నా అకౌంట్లో రూ.5500 పింఛను ఒకే నెలలో రెండుసార్లు వచ్చింది’’ అని చెబుతారు. ఇందుకు బ్యాంకు మేనేజరు..

‘‘లక్కీగా ఎక్కువ డబ్బులే వచ్చాయి కదా ఉంచేసుకో. ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం పెద్ద తంతంగం.. వదిలేయండి. ఎవరికి తెలుస్తుంది’’ అంటాడు. ‘‘నాకు తెలుస్తుంది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే’’ అని నాగార్జున సమాధానం ఇస్తారు.

దీంతో ఆ బ్యాంకు అధికారి.. నాగార్జున అభ్యర్థనను అంగీకరిస్తారు. ‘నిజాయతీ ఎక్కడో నమ్మకమూ అక్కడే’ అనే కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. హిందీలో ఈ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. కానీ మన్మధుడు ఇలా కనిపించడం వైరల్గా మారింది...ప్రతి ఒక్కరి నోట ఇదే మాటా...అయింది...