//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినిమాల్లో పవన్ ' రీ- ఎంట్రీ' పై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు...ఎన్టీఆర్‌, కృష్ణ లా ఐతే పవన్ చేయడు....?

Category : movies

మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో అక్కడి ప్రధాన పార్టీలు అయిన టీడీపి, వైసీపీ పార్టీలకు ప్రధాన పోటీని సైతం ఇచ్చిన మరో రాజకీయ పార్టీ జనసేన. 2014 ఎన్నికల కు ముందే జనసేన పార్టీ స్థాపించ బడినప్పటికీ.... అప్పటి ఎన్నికల్లో కేవలం టీడీపి పార్టీ కి మద్దతు గా మాత్రమే నిలిచి ఆ పార్టీ గెలుపు కీలక పాత్ర వహించిన జనసేన. ఈ సారి ఎన్నికల్లో మాత్రం తనదైన బలాన్ని చాటే ప్రయత్నం అయితే చేసిందనే చెప్పాలి.ఇది ఇలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించినన్ని సీట్లు రాకపోతే పవన్ ఆ పార్టీని ఇలాగే కొనసాగిస్తారా....లేక మధ్యలోనే వదిలేస్తారా అన్నది ఓ ప్రశ్నగా మారింది.2009 ఎన్నికల తరువాత పీఆర్పీ పార్టీ లాగే ప్రస్తుత పవన్ రాజకీయాలు ఉండ నున్నయా అన్నది కూడా అందరి లో నెలకొన్న భావన.ఈ నేపధ్యంలో భాగంగానే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల పై పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు మెగాబ్రదర్ నాగబాబు.తాజాగా ఆయన ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీని నిలబెడతారా.? లేక మధ్యలోనే వదిలేసి మళ్లీ సినిమాలవైపు అడుగులు వేస్తారా...? అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మెగాబ్రదర్ . ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో సైతం నరసాపురం నుండి జనసేన ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన నాగబాబు.. ఆ పార్టీ దశ-దిశలపై తనదైన క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా .. ‘కొన్ని మీడియా ఛానల్స్ పనికట్టుకుని ఆయన్ని తగ్గించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యలని ఆయన కొట్టి పారేశారు. ఏ వ్యక్తి మాట్లాడిన చిరంజీవి గారు అప్పుడు అలా చేశారు కదా అంటున్నారు.. ఒకే ఇంట్లో అందరూ ఒకేలా ఉండాలని ఏమైనా రూల్ ఉందా....? కళ్యాణ్ బాబుని వీలైంతవరకూ ముట్టుకోకుండా ఉంటేనే ఎవరికైనా మంచిదనీ.. ఎంత అణచాలని ప్రయత్నించినా అంతలా పైకి లేస్తాడనీ నాగబాబు చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.. తాను ఇంక సినిమాలు చేయనని.. మళ్లీ పదే పదే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అది జరగని పని. గతంలో రామారావుగారు, క్రిష్ణగారు, కృష్ణం రాజు గారు రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ సినిమాలు చేశారు. అయితే రామారావుగారిలాగే పవన్ కళ్యాణ్ చేయాలనే రూల్ ఏమైనా ఉందా....? పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు సినిమాలు చేయనని తేల్చి చెప్పేశారు. అది ఆయన వ్యక్తి గత అభిప్రాయం. దాన్ని మనం గౌరవించాలి’ అంటూ పవన్ పై వస్తున్న వార్తల పై ఓ క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం చేశారు నాగబాబు.