//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫిల్మ్ ఇండస్ట్రీ మాఫియాతో పోలుస్తూ, అల్లు అరవింద్ ఓ... దావూద్ ఇబ్రహీం అంటున్నాడు ....మెగా బ్రదర్

Category : movies

తాజాగా మెగా బ్రదర్ నాగ బాబు ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర సమాధానాలు చెప్పడం జరిగింది.ఉద్దానం సమస్య,అగ్రిగోల్డ్, ఫాతిమా కాలేజ్, సమాజంలోని ప్రతి అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వచ్చిన సినీ రంగం గురించి ఎందుకు మాట్లాడట్లేదు...? చిన్న సినిమాలపై అంత అన్యాయం జరుగుతున్న ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు...? అన్న ప్రశ్నకు సమాధానంగా నాగబాబు మాట్లాడుతూ.."సురేష్ బాబు ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ'’ ఈ నాలుగు కుటుంబాలు ఒకవైపు, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు

మరోవైపు, అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు ఇంకోవైపు . వీళ్లను పక్కనబెడితే ఇంతకంటే పెద్ద మాఫియా ఎవరుంటారు. మేమే పెద్ద మాఫియా. అరవింద్ గారు ఓ... దావూద్ ఇబ్రహీం.. మా అన్నయ్య చిరంజీవి గారు ఒక చోటా రాజన్, లేదంటే సురేష్ బాబు ఒక చోటా రాజన్.

ఇవన్నీ వట్టి వెధవ ఆరోపణలు, పిచ్చి మాటలు, ఎవ్వరినీ ఎవరూ కంట్రోల్ చేయలేరు. చిన్న సినిమాలు రిలీజ్ కాకపోవడానికి డిస్ట్రిబ్యూటర్స్‌కు సంబంధించిన విషయమే కానీ . పెద్దోళ్లు వెళ్లి, ఇప్పుడు ఫలానా వాళ్ల సినిమా రిలీజ్ అవుతుంది. దానిని రిలీజ్ కాకుండా ఆపండి అని ఎవరూ అనరు.ఎవరి సినిమా బాగుంటే వారిదే చూస్తారు. ఎవరికి డిమాండ్ ఉంటే వాళ్లే పైకి వస్తారు. ఈ నలుగురు చేతుల్లోనే మొత్తం గ్రిప్ ఉంటే మరి మా వాళ్ల సినిమాలకు ఫ్లాప్‌లు ఎందుకొస్తాయి.....? మా చేతుల్లో ఏ పవర్ ఉండదు. ఇది నిజం. కొన్ని థియేటర్స్ అరవింద్, దిల్ రాజు చేతుల్లో ఉండొచ్చు కానీ...

అసలు సమస్య థియేటర్స్ దగ్గరే వస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. ఫిబ్రవరి - ఏప్రిల్ వరకూ పెద్దగా సినిమాలేం రిలీజ్ కావు. ఇప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు కానీ బిజీగా ఉన్న టైంలోనే రిలీజ్ చేయాలంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ డబ్బులొచ్చే సినిమానే తీసుకుంటారు. థియేటర్స్ ఖాళీగా ఉంటే చిన్న సినిమాలు కూడా తీసుకుంటారు. దమ్ము, కెపాసిటీ ఉంటే సినిమాలు ఆడతాయి. నేడు పెద్ద సినిమాలకు కూడా 3-4 వారాలకు మించి ఆడే కెపాసిటీ లేదు అంతే’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Related News