Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్…

Category : movies

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున తనయుడిగా తెలుగు తెరకి పరిచయమైన నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ” శైలజా రెడ్డి అల్లుడు “. ఈ చిత్రంలో చైతు తొలి సారిగా అను ఇమ్మాన్యుయేల్ తో నటించటం మరో విశేషం.

ప్రముఖ నటి రమ్య కృష్ణ ఇందులో చైతు కి అత్తా పాత్రలో నటిస్తుంది . ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ లో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు .

ఒక అభిమాని ఎన్టీఆర్ నటించిన సినిమాలో మీకు ఏది అంటే ఇష్టం అని అడగ్గా అందుకు సమాధానంగా నాగ చైతన్య యమదొంగ ఇష్టం అని, ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు చూస్తాను..ఒక నటుడిగా ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే పాత్రలు తనకి ఎంతో ఆదర్శమని, ఇంకా ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్.. అతను ఒక నిజమైన అల్ రౌండర్అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చైతన్య ప్రశంసల జల్లు కురిపించారు.

అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ పై లేని అభిమానం సడన్ గా చైతు కి ఎందుకు కలిగిందో..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చైతు మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు .