//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూటు మారుస్తున్న చైతు & సామ్

Category : movies

టాలీవుడ్ బెస్ట్ క్యూట్ కపుల్ గా బాగా నోటెడ్ అయిపోయిన నాగ చైతన్య సమంతాల జంట పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా వాటి తాలూకు జ్ఞాపకాలు అభిమానులకు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. వివాహానికి ముందు ఈ ఇద్దరు కలిసి నటించిన ఆఖరి చిత్రం మనం. ఏఎన్నార్ తో మొదలుకుని అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన అరుదైన సినిమాగా మిగిలిపోయిన మనంలో చైసామ్ ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. మొదట్లో వచ్చే ఫస్ట్ నైట్ సాంగ్ మొదలుకుని ఇద్దరు జీవించారని చెప్పాలి.

ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్నా మజిలీ(వర్కింగ్ టైటిల్)లో అలాంటి రొమాన్స్ ని ఫ్యాన్స్ ఆశించడం సహజం. కానీ ఇందులో ఆ స్థాయిలో అవేవి ఉండవని సైడ్ టాక్ వస్తుంది కానీ అది నిజమో కాదో మూవీ రిలీజ్ అయ్యావరకు మనం ఎదురుచూడవలసిందే . సున్నితమైన కథలతో భావోద్వేగాలను బాగా ప్రెజెంట్ చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దీన్ని కూడా చాలా సెన్సిబుల్ గా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ప్రేమ కథే అయినప్పటికీ చైతు సామ్ ల మధ్య మనం తరహాలో కాకుండా మంచి ఫీల్ గుడ్ ట్రాక్ రాసుకున్నాడని తెలిసింది. చైతు సామ్ ల తో వారి పెళ్లి జరిగాకా వచ్చే ఫస్ట్ మూవీ కనుక ఫాన్స్ ఆసక్తి గా వున్నారు. అంతకు ముందు వాళ్లిద్దరూ కలిసి చేసిన మూవీ కంటే ఈ మూవీ బెస్ట్ గా ఉండబోతుంది అని మంచి టాక్ వుంది .

చైతు సామ్ ఇందులో చైతు క్రికెటర్ గా నటిస్తున్నట్టు తెలిసింది. క్రికెట్ అంటేనే ఇష్టం లేని పాత్రలో సామ్ కూడా కొత్తగా కనిపిస్తుందట. ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న టీమ్ ఇది పూర్తి కాగానే వైజాగ్ వెళ్లనుంది. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.