//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాగ్ మన్మథుడు-2 కి పోటీగా ....జగపతి బాబు "శుభలగ్నం" సీక్వెల్

Category : movies

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య బయోపిక్ మూవీస్ ఎంత ట్రెండ్ సెట్ చేస్తున్నాయో తెలిసిన విషయమే.అయితే ఈ ట్రెండ్ కి తోడు సీక్వెల్ సినిమాల హవా కూడా ఈ మధ్యే మొదలైంది.ఇప్పటికే ఈ జాబితాలోకి బాహుబలి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, మన్మథుడు-2 ,కాంచన,ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లు ఇంకా రానున్నాయి ...

ఈ వరుసలోకె తాజాగా విలక్షణ నటుడు హీరో జగపతిబాబు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'శుభలగ్నం' ఒకటి. ఇపుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జగపతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది ఈ చిత్రం. ఇందులో హీరోయిన్స్ గా రోజా,ఆమని చాల బాగా నటించారు.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 'యాత్ర' సినిమాను నిర్మించిన 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతాడని అంటున్నారు. ఇక ఈ సీక్వెల్ ను ఎవరితో చేస్తారు...? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది...? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.ఇపుడిపుడే మొదలైన ఈ సీక్వెల్ ట్రెండ్ ఇంకెన్ని సూపర్ హిట్ సినిమాలు ఈ జాబితాలో చేరనున్నాయో చూడాలి.

Related News