Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు.మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు !!

Category : state politics

తెలుగుదేశం పార్టీ ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలనే వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పరిస్థితి మెరుగవుతుందని టీడీపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ అంశంపై ఏపీ మాజీ సీఎం "నాదెండ్ల భాస్కర్ రావు" ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల దీనిపై తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు.అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో కూడా తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.తాను సినిమాలు చూడనని చెప్పారు.

అయినా ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు.జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా "నాదెండ్ల భాస్కర్ రావు" తనదైన శైలిలో స్పందించారు.జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు.ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు.తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో ఆయన ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో తనకు తెలియదని అన్నారు.ఈ విషయంలో ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందని ఆయన అన్నారు.

Related News