Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నభా నటేష్‌ కి మరో బంపర్ ఆఫర్

Category : movies

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ తో బంప‌ర్ హిట్ అందుకుంది న‌భా న‌టేష్. రామ్-న‌భా న‌టేష్ ల రొమాన్స్ ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా పండింది. అమ్మ‌డి హాట్ పెర్పామెన్స్ కుర్రాళ్లంతా ఫిదా. తెలంగాణ స్లాంగ్ లోనూ అద‌ర‌గొట్టింది. ట‌ర్కీ కోడిలా ఉంద‌టూ రామ్ ప‌లికిన డైలాగ్ కి థియేట‌ర్లో ఈల‌లే. ఇలా ఒక‌టేంటి ప్ర‌ధ‌మార్థమంతా పూరి త‌న సంభాష‌ణ‌ల‌తో విశ్వ‌రూపం చూపించాడు. దీంతో న‌భా టాలీవుడ్ కెరీర్ కి కొన్నాళ్ల పాటు తిరుగులేద‌ని ఎన‌లిస్టులు భావించారు. ఇప్పుడా దిశ‌గా అడుగుటు ప‌డుతున్నాయి. న‌భా తొలి సినిమా స‌ధీర్ బాబు స‌ర‌స‌న న‌న్ను దోచుకుందువ‌టే. ఈ చిత్రం యావ‌రేజ్ గా ఆడింది.

కానీ గ్లామ‌ర్ రోల్ కాదు కాబ‌ట్టి అమ్మ‌డి అందాలు ఎలివేట్ కాలేదు.అదే స‌మ‌యంలో పూరి చేతుల్లో ప‌డేస‌రికి అమ్మ‌డినిని పీక్స్ లో చూపించాడు. ప్ర‌స్తుతం టీమ్ అంతా ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. స‌క్సెస్ టూరు తెలుగు రాష్ర్టాల‌ను చుట్టేస్తున్నారు. పూరి రెండు నెల‌లు విశ్రాంతి తీసుకుని కొత్త ప్రాజెక్ట్ వ‌ర్క్ మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో పూరి కేవ్ నుంచి ఓ ఆస‌క్తిక‌ర లీకు అందింది. పూరి త‌దుప‌రి సినిమాలో న‌భా న‌టేష్ ను హీరోయిన్ గా తీసుకున్నాడుట‌. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావ‌డంతో న భా కీల‌క పాత్ర పోషించ‌డంతోనే పూరి రెండ‌వ‌సారి ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని అంటున్నారు. సినిమా హిట్ అయినా…ఫెయిలైనా పూరి పాత హీరోయిన్ల‌ను పెద్ద‌గా రిపీట్ చేయ‌డు. రిపీట్ చేయ‌డం అనేది చాలా రేర్ గా జ‌రుగుతుంది. పూరి ప్లాప్ ల్లో ఉన్న‌ప్పుడు పోకిరి తెర‌కెక్కించాడు. అందులో హీరోయిన్ ఇలియానా.

ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో త‌దుప‌రి గోవా బ్యూటినీ కొన్ని సినిమాల్లో చాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇస్మార్ట్ తో రీ చార్జ్ అయిన నేప‌థ్యంలో నభా న‌టేష్ కు ఛాన్స్ ఇచ్చాడ‌ని కాంపౌండ్ వ‌ర్గా ల నుంచి జోరుగా వినిపిస్తోంది. అలాగే కొత్త ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను న‌భాకు మంచి ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఓ పెద్ద నిర్మాణ సంస్థ‌ ఆమెను బ‌ల్క్ గా డేట్లు అడిగిందని తెలిసింది.