పాకిస్థాన్ లో బాలికల వివాహ వయసును పెంచాలనే ప్రతిపాదనను పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ తోసిపుచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో బాలికల వివాహ వహోపరిమితి పదహారు సంవత్సరాలుగా ఉంది, దానిని పద్దెనిమిదేళ్ళకు పెంచాలని కీష్వర్ జెహ్రా ప్రతిపాదించిన బాల్య వివాహ నిరోధక (సవరణ) బిల్లు, 2016ను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. ఈ సవరణ ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ సవరణను ముస్లిం సభ్యులు మాత్రమే కాకుండా హిందూ, క్రైస్తవ పార్లమెంటేరియన్లు కూడా వ్యతిరేకించడం విశేషం.