//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బయ్యర్లను ఆదుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్

Category : movies

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ , రంగస్థలం సినిమాలతో వరస మూడు బ్లాక్ బస్టర్లతో అందరి చూపుని తమవైపు తిప్పుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్. నాగ చైతన్య తో చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం సవ్యసాచి. సరికొత్త కాన్సెప్ట్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈ సినిమాను కొన్నవారందరికి నష్టాలు తప్పలేదు. దీంతో మైత్రీ వారు బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్ల కోసం ఒక ఆలోచనతో ముందుకు వచ్చారట. Mythri Movie makers help to buyers

మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్ గా శ్రీను వైట్ల దర్శకత్వం లో 'అమర్ అక్బర్ అంటోనీ' విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 'సవ్యసాచి' బయ్యర్లకు నామమాత్రపు ధరలకే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. కొన్ని ఏరియాల్లో అసలు అడ్వాన్సు తీసుకోకుండా రైట్స్ ఇచ్చారని కూడా అంటున్నారు. దీంతో 'సవ్యసాచి' వల్ల డబ్బు నష్టపోయిన వారికి ఉపశమనం కలిగించినట్టుగా ఉంటుందని భావిస్తున్నారట. మైత్రీ వారికి శాటిలైట్.. డిజిటల్.. హిందీ రైట్స్ ద్వారా ఈ సినిమాకు బాగానే ముట్టిందట. 'సవ్యసాచి' బయ్యర్లను ఆదుకోవడానికి ముందుకు రావడానికి అదీ ఒక కారణమట.Mythri Movie makers help to buyers

కానీ కొందరు ట్రేడ్ విశ్లేషకుల మాత్రం 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాకు హైప్ లేదని శ్రీను వైట్ల సినిమా మీద ఇన్వెస్ట్ చేసేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతోనే 'సవ్యసాచి' బయ్యర్ల చేతిలో పెడుతున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా మైత్రీవారు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి ఎక్కుతారో లేదో వేచి చూడాలి.Mythri Movie makers help to buyers