//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివేకా హత్యకేసు .. పులివెందుల సీఐ పై సస్పెన్షన్ వేటు

Category : state politics

మాజీ ఎంపీ, జగన్ బాబాయి , వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పోలీసులకు షాక్ తగిలింది. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తుండగా మరోవైపు పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆధారాలు కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ అర్బన్ సీఐ శంకరయ్యను సస్పెండ్ చేశారు. డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయడంలో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయామని పోలీసు శాఖ భావిస్తోంది. అంతకుముందు వైసీపీ నేత అవినాష్ రెడ్డి తీరు పట్ల కూడా సీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్త సంచలనం గా సరిగా ఎన్నికల సమయంలో పులివెందులలో సొంత నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా ఆయనది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలనున్నట్లు స్పష్టమైంది. తల వెనుక భాగంలో బలమైన గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నుదుటిపై రెండుచోట్ల లోతైన గాయాలున్నాయని... ఛాతీ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో వివేకా హత్యపై సిట్‌తో దర్యాప్తు ప్రారంభించారు. అయితే అసలు హత్యకు గల కారణాలు , కీలక ఆధారాల సేకరణలో పోలీసుల నిర్లక్ష్యానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐ పై వేటు వేశారు పోలీస్ ఉన్నతాధికారులు.

Related News