ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా బిగ్ ఫ్యాషన్ గిగ్‌ను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు మొదటి ఎడిషన్ బిఎఫ్జి పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలతో లైవ్ ఫ్యాషన్ సంభాషణలు, బాలీవుడ్ స్టైల్ ఐకాన్లు, డిజైనర్లు, ఫ్యాషన్‌ను అనుసరించే వారిని ఈ వేదిక ద్వారా ఒక తాటిపైకి తీసుకురానున్నట్టు మింత్రా పేర్కొంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్, ఫ్యాషన్‌కు సంబంధించిన అంశాలను బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, హ్యాండ్ పిక్డ్ రూపంలో కూడిన తన సమ్మర్ రహస్యాలను బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే పంచుకుంటారని తెలిపింది. సెలబ్రిటీల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ పొగ్రామ్ ద్వారా 35 నూతన బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు సంస్థ వెల్లడించింది. తద్వారా 10 లక్షలకుపైగా వినియోగదారులకు ప్రయోజనం కలగనుందని మింత్రా తెలిపింది. దీంతో సాధారణ రోజుల కంటే 3 రేట్లు అధికస్థాయిలో వినియోగదారుల రద్దీ తమ వేదికపై నమోదు కానుందని, అలాగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 3రేట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపింది.