మంటల్లో కాలిపోతున్నవి ఏమిటో తెలుసా? వందల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినం సందర్భంగా వివిధ దేశాల్లో సోమవారం ఇలా మత్తుమందులను కుప్పలుగా పోసి దహనం చేశారు. మయన్మార్, లావోస్, చైనా, థాయ్‌లాండ్ దేశాల్లో గత ఏడాది భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్న మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. మయన్మార్, థాయ్‌లాండ్, కాంబోడియా దేశాల్లో దహనం చేసిన మత్తుమందుల విలువ ఒక బిలియన్ డాలర్లు (సుమారు 6450 కోట్ల రూపాయలు) ఉంటుంది. ఒక్క మయన్మార్‌లోనే రూ. 2480 కోట్ల విలువైన ఓపియం, హెరాయిన్, కొకెయిన్, మెథంఫెటమైన్ బిళ్లలను దహనం చేశారు. ఇంత భారీ స్థాయిలో మత్తుమందులు ధ్వంసం చేయడం మయన్మార్ చరిత్రలో ఇదే మొదటిసారి.