//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

' మై డియర్ మార్తాండం '..తో కామెడీ పృథ్వీ!

Category : movies

పృథ్వీ అంటే మనకి గుర్తొచ్చే డైలాగు ' థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం థియేటర్లలో నవ్వులు పువ్వులు పూయించిన డైలాగ్ ఇది. ఎన్నేళ్లయినా, ఎన్ని సినిమాలు వచ్చినా ఈ డైలాగ్ మాత్రం పదిలంగా అలానే నిలిచిపోయింది. దానికి కారణం హాస్యనటుడు పృథ్వీ.

ఆ డైలాగును ఆయన అంత బాగా చెప్పడమే కాదు.. తనదైన మేనరిజమ్‌తో గడుపుబ్బా నవ్వించారు. అందుకే ఇప్పటికీ ఆయన్ని ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ అనే అంటారు చాలా మంది.

కామెడీ టైమింగ్, మేనరిజంతో తెలుగులో టాప్ కమెడియన్‌గా పృథ్వీ ఎదిగారు. అంతే కాదు హీరోగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే సినిమా కూడా చేశారు. ఇప్పుడు మరో సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ఈ కొత్త సినిమాలో లాయరుగా కనిపిస్తున్నాడంట..పుంపుహార్ పరమానందం - 30 రోజులలో లాయర్ అవ్వడం ఎలా?’ అని రాసుంది. ఈ వింత విశేషంగా మారిందట. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాలో చేసిన వాళ్ళు అందరు మంచిగా చేసారని సినిమాని అతి త్వరలో ముందుకు తెస్తామని చెప్తున్నారు ఆ సినీ వర్గీయులు...