//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ వీడియో

Category : national

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. కాళ్లు, చేతులు లేని చిన్నారి జారుడు బల్ల ఎక్కేందుకు పడుతున్న తపన ఆయన్ను కదిలించింది. ఓ పాప హాయిగా ఆడుతూ పాడుతూ జారుడు బల్ల మీద నుంచి జారుతుంటుంది. దాన్ని చూసిన ఈ చిన్నారి కూడా జారుడు బల్లపైకి చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పాప సంకల్పం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. కష్టపడి మెట్లన్నీ ఎక్కిన తర్వాత జారుడు బల్ల మీదకు చేరుకోగానే ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో చూశాక తనకు మరేదీ కష్టంగా అనిపించడం లేదని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ముందుగా ఈ వీడియో చూడని ఆయన తర్వాత దాన్ని షేర్ చేయకుండా ఉండలేకపోయారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. భారీగా లైకులు, కామెంట్లతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియో ఎవరికైనా స్ఫూర్తిని కలిగించకపోతే మరేదీ స్ఫూర్తినివ్వలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.