//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట‌్రిపుల్ త‌లాక్‌ కు అయోధ్యతో ముడిపెట్టిన ముస్లిం బోర్డు

Category : national

అయోధ్య శ్రీ రాముడి జన్మస్థానం అని చెప్పడానికి తమ విస్వాసమే ప్రధాన కారణం అని హిందువులు వాదిస్తున్న విధంగానే ముస్లిం లకు ట‌్రిపుల్ త‌లాక్‌ వారి విస్వాసానికి సంబంధించిన అంశం అని ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్పష్టం చేయిసింది. 

ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో జరుగుతున్న విచారణలో పాల్గొంటూ క్రీ.శ‌.637 నుంచి అమలులో ఉన్న ఈ ఆచారంపై తీర్పు చెప్పడానికి మీరెవ్వడు అన్నట్లు పేర్కొన్నారు. 

 త‌లాక్ అనేది త‌మ‌కు న‌మ్మ‌కం అని, 1400 ఏళ్లుగా పాటిస్తున్న ఆచార‌మ‌ని స్పష్టం చేశారు. రాముడు అయోధ్య‌లోనే జ‌న్మించాడ‌ని హిందువులు ఎలా న‌మ్ముతున్నారో.. త‌లాక్ అనేది త‌మ‌కూ అలాంటి న‌మ్మ‌క‌మేన‌ని అన‌డం గ‌మ‌నార్హం. 

అందువ‌ల్ల స‌మాన‌త్వం, రాజ్యాంగ బ‌ద్ధ‌త అన్న అంశాలు అస‌లు ఉత్ప‌న్న‌మే కావ‌ని ముస్లిం బోర్డు త‌ర‌ఫున కోర్టులో వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ క‌పిల్ సిబ‌ల్‌ అన్నారు. ట్రిపుల్ త‌లాక్ అనేది క్రీ.శ‌.637 నుంచి ఉంది. అలాంటిదాన్ని ఇస్లాం వ్య‌తిరేకం అని మ‌నం ఎలా అంటామని ఆయన ప్రశ్నించారు. 

 ఇది న‌మ్మ‌కానికి సంబంధించిన విష‌యం అని సిబ‌ల్ వాదించారు. ప్రాఫెట్ ముహ‌మ్మ‌ద్ త‌ర్వాతి కాలంలో ట్రిపుల్ త‌లాక్ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్లు హ‌దిత్‌లో ఆధారాలు కూడా ఉన్న‌ట్లు సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. 

అయితే ట్రిపుల్ త‌లాక్ మంచి ఆచారం అని తాము అన‌డం లేద‌ని కూడా ఈ సంద‌ర్భంగా సిబ‌ల్ పేర్కొన్నారు. ఇందులో మార్పు రావాలని అంటూ అయితే వేరే వారి జోక్యం వద్దని కోరుతున్నట్లు తెలిపారు.