//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

s s thaman movies : ఎస్ ఎస్ థమన్ సినిమాలు : music director s s thaman biography hit songs family

Category : editorial

భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్.థమన్ పూర్తీ పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో సంగీత దర్శకుడిగా పని చేస్తారు.

ఇతను ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించాడు. ఇతను అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన “సీతారామ జననం” సినిమాను తెరకెక్కించిన గతకాలపు దర్శకుడు మరియు నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు.

ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె.చక్రవర్తి కింద ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని మరియు తన అత్త పి.వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు.

అతి తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌లో 50సినిమాలకు సంగీతం అందించిన డైరెక్టర్ గా రికార్డు నెలకొల్పాడు.

మాస్, క్లాస్, మెలోడీ పాటలతో మెస్మరైజ్ చేసే సంగీత దర్శకుడు తమన్. చాలా రోజుల తర్వాత తన చిరకాల స్వప్నం నెరవేరబోతోందని తెలిపాడు. ఈ ఏడాది భాగమతి, తొలిప్రేమ వంటి హిట్ చిత్రాలతో ఊపు మీద ఉన్న తమన్‌కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో పనిచేయాలనేది నా చిరకాల స్వప్నం. అది త్వరలోనే నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపాడు.

త్రివిక్రమ్ - ఎన్టీఆర్‌ల సినిమా షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుంది. తమన్ సంగీతం అందించిన ‘చల్ మోహన్ రంగ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related News