ఇళయరాజా భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు.జూన్ 2, 1943 లోతమిళనాడు,మధురై జిల్లా పన్నైపురం లో జన్మించాడు. తమిళనాడు రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది.
తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.
ఇళయరాజా భారతదేశంలోని, చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే .జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాలు నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేఛ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.
ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలు రెండూ భారతీయ, పాశ్చ్యాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం "హౌ టు నేమ్ ఇట్" (1986) కర్నాటక సంగీతకారుడు త్యాగరాజుకు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాఁక్ లకు అంకితమిచ్చాడు. రెండవ ఆల్బం "నథింగ్ బట్ విండ్" (1988), ప్రముఖ బాఁసురీ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఇంకా యాభై మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం, వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారుచేయబడింది.
ప్రత్యక్ష ప్రదర్శనలు :
ఇళయరాజా గారు అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25సంవత్సరాల్లో మొదటి సారిగా 16 అక్టోబరు 2005 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.
2004 ల ఇటలీ లోని అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
ఇథు ఇళయరాజా అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.
28 డిసెంబరు 2011 న జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో ఎన్రెంద్రుం రాజా అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను తమిళ ఛానల్ జయా టీ.వీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
23 సెప్టెంబరు 2012 న, నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్,బెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
2012 న ప్రకాష్ రాజ్ చిత్రం ధోని ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికాలో మొదటిసారిగా, కెనడా, టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు, దీనిని స్టార్ విజయ్ టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్ మరియు పీ.ఏ+ సహకరంతో ప్రదర్శన నిర్వహించారు.
ఉత్తర అమెరికాలో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో, మరియు మార్చి 1, 2013 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.
తన ఉత్తర అమరికా ప్రదర్శనల తర్వాత, 24 ఆగస్టు 2013 న ఇళయరాజా, తన కొడుకులు మరియు సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా మరియు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి లండన్ లోని అరేనాలో సంగీత ప్రదర్శన ఇచ్చారు.
1988 లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఇళయరాజా గారికి 'ఇసైజ్ఞాని' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను ఇసైజ్ఞాని అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక కళైమామణి పురస్కారం అందుకున్నారు.
1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం.
2010 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరిచింది.
2018 లో భారత అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ ఈయన ను వరించింది.