దేవీశ్రీ ప్రసాద్ సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.
విశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి సినిమా గా దేవి కి సంగీత దర్శకుడిగా పనిచేసాడు.దేవి భారతీయ సంగీత దర్శకులైన ఇళయరాజా,ఏ ఆర్ రెహమాన్ గారికి వీరాభిమాని.
టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.సినిమా ఎలాగున్నాతన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ సినిమాను నిలబెట్టడం లో కీలక పాత్ర పోషిస్తుంటాడు.అప్పుడప్పుడు ఈయన సినిమాలో కూడా కనిపిస్తుంటాడు.త్వరలో దేవి హీరో గా ఒక సినిమా రానుంది.రీసెంట్ గా రిలీజ్ అయిన రంగస్థలం లోని మొదటి పాట కి దేవి ని మెగా ఫాన్స్ అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు.
కొన్ని రోజులుగా దేవి శ్రీ ఇతర దేశాలలో స్టేజి షో లతో అలరిస్తున్నాడు.అయన తెలుగు లో ఇంకా చాల సినిమాలు చేయాలనీ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.