//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బలితీసుకున్న రూపాయి......!

Category : national

ఇప్పుడున్న కాలం ఎన్నో దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ మధ్య కాలం లో డబ్బు కోసం జరిగే హత్యలు ఎక్కువగానే మనం చూస్తున్నాం. అధేవిధం గా డబ్బు కోసం మరో దారుణం ముంబై లో జరిగింది.

వివరాలలోకి వెళ్తే, మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి, నశిస్తున్న మానవీయతకు నిదర్శనం ముంబై లో జరిగిన హత్య. కేవలం ఒక రూపాయి ఒక సీనియర్‌ సిటిజన్‌ ప్రాణాలను బలితీసుకుంది. ముంబైలోని థానేలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..థానే కళ్యాణ్ పట్టణానికి చెందిన మనోహర్ గమ్నే (54) కోడిగుడ్లుకొనడానికని సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బులో ఒక రూపాయి తక్కువైంది. షాపు ఓనర్‌ గమ్నేని దుర్భాషలాడాడు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.    విషయాన్ని తెలుసుకున్న  బాధితుని కుమారుడు దీనిపై  దుకాణదారుడిని ప్రశ్నించాడు.  అంతే...వివాదం మరింత ముదిరింది. విచక్షణ  మరిచిన షాపు  యజమాని కొడుకు  గమ్నే పై  పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన అక్కడిక్కడకే ప్రాణాలువిడిచాడు. ఈ ఘటన పై నిందితుడు సుధాకర్‌ ప్రభు (45) అరెస్ట్‌ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్టు థానే పోలీసు అధికారి సుఖదా నర్కార్‌ తెలిపారు.