//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పొరపాటు నాదే.....క్షమించండి....!

Category : politics

తిరుమల వెంకటేశ్వరుడిని వెంకన్నచౌదరి అంటూ సంబోధించడంపై ఎంపీ మురళీమోహన్ వివరణ ఇచ్చారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఎంపీ దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వెంకన్నస్వామి అనబోయి పోరపాటున వెంకన్న చౌదరి అంటూ నోరు జారానని అని ఎంపీ చెప్పుకొచ్చారు. దేవుడికి కులాన్ని అంటగట్టే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులంతా తనను క్షమించాలని ఎంపీ మురళీమోహన్ కోరారు.

ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఎంపీ మురళీమోహన్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఎంపీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.