ఐపీల్ పదో సీజన్ లో ముంబాయి తన మొదటి విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి మూడు ఓవర్లలో 49 పరుగులు అవసరం. ఇక ముంబాయి ఓటమి తప్పదు అనుకుంటున్నసమయంలో కోల్ కత్తా ఆశలపై నీళ్లు చల్లుతూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు నితీష్ రాణా. 29 బంతుల్లో (5*4,3*6)లతో 50 పరుగులు చేసి ముంబాయి విజయానికి గట్టి పునాది వేశాడు. విజయానికి 20 పరుగులు వ్యవధిలో రాణా నిష్క్రమించిన .. పాండ్య (11 బంతుల్లో 3*4,2*6 లతో 29 నాటౌట్) కోల్ కత్తా కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించాడు.
మనీష్ పాండే :-
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా ఓపెనర్లు గంభీర్ (19), లీన్ (32) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి మొదటి వికెట్ కి 44 పరుగులు జోడించాక, గంభీర్ ను కృనాల్ పాండ్య అవుట్ చేశాడు. తరువాత వచ్చిన ఉతప్పను కూడా పాండ్య ఔట్ చేయడంతో స్కోర్ మందగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పటిలాగే తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు మనీష్. 5 సిక్సర్లు, 5 పొర్లతో విలువైన 81 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును, ప్రత్యర్థికి భారీ లక్షాన్ని నిర్దేశించడంలో కీరోల్ పోషించాడు.
స్కోర్ వివరాలు
కోల్‌కతా ఇన్నింగ్స్:
గంభీర్ (సి) మెక్లెనగన్ (బి) కృనాల్ 19; లిన్ ఎల్బీ (బి) బుమ్రా 32; ఉతప్ప (సి) హార్దిక్ (బి) కృనాల్ 4; మనీష్‌పాండే నాటౌట్ 81; యూసుఫ్ పఠాన్ (సి) హార్దిక్ (బి) కృనాల్ 6; సూర్యకుమార్ (సి) పొలార్డ్ (బి) మలింగ 17; వోక్స్ (సి) పొలార్డ్ (బి) మలింగ 9; నరైన్ ఎల్బీ (బి) మెక్లెనగన్ 1; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178;
వికెట్ల పతనం:
1-44, 2-48, 3-67, 4-87, 5-131, 6-144, 7-178;
బౌలింగ్: మలింగ 4-0-36-2; మెక్లెనగన్ 4-0-51-1; బుమ్రా 4-0-39-1; కృనాల్ పాండ్య 4-0-24-3; హర్భజన్ 4-0-27-0
ముంబయి ఇన్నింగ్స్:
పార్థివ్ ఎల్బీ (బి) కుల్దీప్ యాదవ్ 30; బట్లర్ ఎల్బీ (బి) రాజ్‌పుత్ 28; నితీష్ రాణా (సి) నరైన్ (బి) రాజ్‌పుత్ 50; రోహిత్‌శర్మ ఎల్బీ (బి) నరైన్ 2; కృనాల్ పాండ్య (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 11; పొలార్డ్ (సి) రిషి ధావన్ (బి) వోక్స్ 17; హర్దిక్ పాండ్య నాటౌట్ 29; హర్భజన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12;
మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 180;
వికెట్ల పతనం:
1-65, 2-71, 3-74, 4-97, 5-119, 6-160; బౌలింగ్: బౌల్ట్ 3.5-0-47-0; వోక్స్ 4-0-34-1; నరైన్ 4-0-22-1; కుల్దీప్ 4-0-35-1; రాజ్‌పుత్ 4-0-37-3