ఐపీఎల్ పదో సీజన్లో చెలరేగి ఆడిన ముంబై ఇండియన్స్ లీగ్దశలోనూ, ప్లేఆఫ్స్‌లోనూ ఓడించిన పుణె సూపర్ జెయింట్‌ను ఫైనల్లో ఓడించి మూడోసారి ఐపీఎల్ చాంపియన్‌గా కేవలం ఒక పరుగు తేడాతో చేచిక్కించుకొంది. నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రోహిత్ సేన జయభేరి మోగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (47) ఒంటరి పోరాటం చేశాడు. 130 పరుగుల లక్ష్యాన్ని చేరి చాంపియన్‌గా నిలువాలని పుణె జట్టు ఆఖరి బంతివరకు పోరాడింది. సారథి స్మిత్ (51) విశ్వప్రయత్నం చేసినా విజయాన్ని అందించలేకపోయాడు.
ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్ ఊహించని మలుపులు తిరిగింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
రాజీవ్‌గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 1 పరుగు తేడాతో పుణెను ఓడించింది. టాస్ గెలిచిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత పుణె 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడినా ఆఖరి ఓవర్లో నాటకీయ పరిణామాల మధ్య ఓటమిని మూటగట్టుకుంది.