//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గెలుపు తలుపు తెరిచిన ముంబై ఇండియన్స్......!

Category : sports

ముంబై ఇండియన్స్ ఈ పేరు తెలియని ఐపీయల్ అభిమాని వుండరు. ఎక్కువసార్లు ఐపీయల్ ట్రోపీ ని అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ కి పేరుంది. కానీ ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో వరుసగా మూడు మ్యాచ్స్ లో ఓటమిపాలయ్యారు. చివరివరకు పోరాడిన వారికీ విజయం మాత్రం దక్కలేదు.

కానీ ఈసారి ముంబై ఇండియన్స్‌ తమ విశ్వరూపాన్ని చూపింది . తొలి రెండు బంతులకే రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 94)తో పాటు ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65) సూపర్‌ బ్యాటింగ్‌తో గ్రౌండ్ ను హోరెత్తించారు . ఫలితంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అన్నింటా రాణించిన ముంబై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ స్కోరు ఛేదన కోసం దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. కోహ్లీ (62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. క్రునాల్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రోహిత్‌కు లభించింది.