కింగ్స్ లెవన్ పంజాబ్ 198 పరుగులు నాలుగు వికెట్లకు, చేసినప్పుడు విజయం తప్పదు అనే అందరు భావించారు. కానీ ముంబాయి ఇండియన్స్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. నితీష్ రానా 34 బంతుల్లో 62 పరుగులు, జోస్ బట్లర్ 37 బంతుల్లో చేసిన 77 పరుగులు మ్యాచ్ ని ఏకపక్షం చేసేసింది. ఈ నేపథ్యంలో ఆమ్లా చేసిన 104 పరుగులు పేలవంగా మారి, పంజాబ్ ని గెలిపించలేకపోయింది. ఈ రోజు పంజాబ్ పై, ముంబాయి ఇండియన్స్ సాధించిన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన బట్లర్, రానా ఈ రోజు ఐపీఎల్ హీరోలు.