//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముంబై ఎయిర్ పోర్ట్ పేరిట సరికొత్త రికార్డు !

Category : national

ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన ఏకైక రన్ వే విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరోసారి తన రికార్డును తానే తిరగరాసింది.

జనవరి 20న 24 గంటల వ్యవధిలో 980 విమానాలు ఇక్కడి రన్ వే పై ల్యాండింగ్, టేఖాఫ్ తీసుకున్నాయి. అంతకుముందు డిసెంబర్ 6న 974 ఫ్లయిట్ల రికార్డు నమోదై ఉంది. రెండో స్థానం బ్రిటన్ లోని గట్విక్ విమానాశ్రయానిదే.

వాస్తవానికి గట్విక్ విమానాశ్ర య సామర్థ్యం ఎక్కువే అయినప్పటికీ రోజులో ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకే విమానాల రాకపోకలకు తెరిచి ఉంటుంది.

దీంతో ఈ విమానాశ్రయం ఒక్క రోజులో 870 విమానాల రాకపోకలను మాత్రమే నిర్వహించగలదు. మన దేశంలో మొదటి స్థానం ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయానిదే. గంటలో 82 ఫ్లయిట్ల ట్రాఫిక్ రికార్డు నిర్వహణ ఉంది.