//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆసియా సంపన్నుల్లో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ

Category : business

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తాజాగా ఆసియా సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో హాంకాంగ్‌కు చెందిన స్థిరాస్థి వ్యాపార దిగ్గజం లీ కా షింగ్‌ను వెనుకకు నెట్టి అంబానీ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.

టెలికం వ్యాపారంలోకి రిలయన్స్ జియో సంచలన రంగప్రవేశం ఈమధ్యకాలంలో ముకేశ్ సంపద భారీగా పెరిగేందుకు దోహదపడింది. జియో సేవలు ప్రారంభించినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు స్థాయిలో ట్రేడవుతున్నాయి. దాంతో ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద 1,250 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.80వేల కోట్ల పైమాటే) పెరిగిందని బ్లూంబర్గ్ పేర్కొంది.

ప్రస్తుతం ముకేశ్ సంపద 3,520 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాది చివరినాటికి బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 29వ స్థానంలో నిలిచిన ఆయన ప్రస్తుతం 19వ స్థానానికి ఎగబాకారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అలీబాబా.కామ్ వ్యవస్థాపకులు జాక్‌మా 4,370 కోట్ల డాలర్ల సంపదతో ఆసియా రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.