ముఖేష్ అంబానీ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల్లో ఒకరు అనే విషయం అందరికి తెల్సిందే..అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖేష్‌ను భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది.
అయితే ప్రస్తతం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కానీ ఆకాష్ పెళ్లి తేదీ ఎప్పుడన్నది వెల్లడికాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ కార్డు ధర ఎంతో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవడం ఖాయం.
ఈ కార్డుకయ్యే వ్యయంతో ఒక ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయవచ్చట.ఆకాష్ పెళ్లి కార్డు ఖరీదు సుమారు లక్షన్నర. ఈ కార్డు తయారీలో బంగారాన్ని వినియోగించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారని వినికిడి.అయితే ఆకాష్ పెళ్లి డిసెంబర్ లో అంగరంగ వైభవం గా జరుగనుంది అని కూడా తాజా సమాచారం.