//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబును ట‌చ్ చేస్తే నీ ప‌ని ఫ‌స‌క్‌.. మోడీకి వ్యాపార దిగ్గ‌జం వార్నింగ్‌..!

Category : politics

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై చేయి వేసి చూడు. నేనేంటో చూపిస్తా..! అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకే ఓ బ‌ఢా పారిశ్రామిక వేత్త వార్నింగ్ ఇచ్చాడట‌. ఈ విష‌యాన్నే ప్ర‌స్తావిస్తూ ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నాన్ని ప్రచురించింది. ఇంత‌కీ ఎవ‌రా పారిశ్రామిక వేత్త..? ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే ఎందుకంత అభిమానం..? ఏకంగా ప్ర‌ధాని మోడీకే ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు..? అస‌లేంటి ఆ క‌థ‌..? అన్న ప్ర‌శ్న‌ల‌కు వివ‌రాలు తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..! అంతేకాకుండా, ఈ క‌థ‌నంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.

ఇక అస‌లు విష‌యానికొస్తే, 2014లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బీజేపీతో జ‌త‌క‌ట్టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను స‌మ‌కూరుస్తామ‌ని ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికిన బీజేపీకి పార్ల‌మెంట్‌లోను, రాజ్య‌స‌భ‌లోనూ టీడీపీ మ‌ద్ద‌తు తెలిపింది. చివ‌ర‌కు తాము ఇచ్చిన హామీల‌న్నిటిని తీసి గ‌ట్టుమీద పెట్టామ‌ని, ఆ హామీల‌ను అమ‌లు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని బీజేపీ తేల్చిచెప్ప‌డంతో మిత్ర‌బంధంతో సాధించ‌లేని ప్ర‌త్యేక హోదాను, ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను పోరాటం ద్వారా సాధించుకుంటాం అంటూ గొప్ప సంక‌ల్ప‌తో సీఎం చంద్ర‌బాబు బీజేపీకి రాం.. రాం చెప్పారు.

ఏపీకి సాయం చేసేది లేదంటూ కేంద్ర ప్ర‌భుత్వం చేతులు విదల్చ‌డంతో సీఎం చంద్ర‌బాబు నిత్య కృషీవ‌లుడై, నిరంత‌ర శ్రామికుడై ఓ ప‌క్క ఏపీ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తూనే.. మ‌రో పక్క కేంద్రం నుంచి న్యాయ‌ప‌రంగా ఏపీకి రావాల్సిన నిధుల కోసం, ప్ర‌త్యేక హోదా కోసం త‌న పోరాటాన్ని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూ ఉన్నారు. ఇలా త‌మ‌ను కాద‌ని, రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను అభివృద్ధి బాట‌లోన‌డిపిస్తున్న సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర ప్ర‌భుత్వం ప‌న్నుతున్న కుట్ర‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ విష‌యాన్నే ఇటీవ‌ల కాలంలో సినీ న‌టుడు శివాజీ మీడియా వేదిక‌గా చెప్పారు.

సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల‌ను మ్యాప్ గీసి మ‌రీ ఎవ‌రు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? ఎవ‌రి ద్వారా చేయిస్తున్నారు..? అన్న విష‌యాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు సినీ న‌టుడు శివాజీ. ఆప‌రేష‌న్ గ‌రుడ‌, ఐటీ దాడులు, ధ‌ర్మాబాద్ కోర్టు నోటీసులు, ఇలా ఒక్కొక్క‌టిగా కేంద్ర ప్ర‌భుత్వం, ఏపీపై, సీఎం చంద్ర‌బాబుపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌న్న విష‌యం ఆధారాల‌తో స‌హా ఇటీవ‌ల నిరూపిత‌మ‌య్యాయి. అయితే, ప్ర‌ధాని మోడీ ఇన్ని కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నా.. సీఎం చంద్ర‌బాబు మాత్రం వ‌ణుకు.. బెణుకు లేకుండా ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూనే, ప్ర‌ధాని మోడీపై పోరాడుతున్నారు. అయితే, ప్ర‌ధాని మోడీ ఎన్ని కుట్ర‌ల‌కు పాల్ప‌డినా సీఎం చంద్ర‌బాబు అంత ధైర్యంగా ఉండ‌టానికి కార‌ణం ఒక‌రు ఉన్నార‌ట‌. అత‌నే, ముఖేష్ అంబానీ,

ప్ర‌పంచ బిలియ‌నీర్‌ల‌లో ఒక‌రైన‌ ముకేష్ అంబాని, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. ఏపీ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా సీఎం చంద్ర‌బాబు, ముఖేష్ అంబానీ భేటీలు జ‌రిగిన సంఖ్య‌ వందల్లో ఉంటాయ‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అటువంటిది వీరి మ‌ధ్య ఉన్న స్నేహ బంధం. ఈ బంధ‌మే సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ముఖేష్ అంబాని అభిమానం పెరిగేలా చేసింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాకుండా, సీఎం చంద్ర‌బాబు నాయుడుపై త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎటువంటి మ‌చ్చా లేదు. అటువంటి చంద్ర‌బాబుపై కుట్ర‌ల‌కు పాల్ప‌డితే స‌హించ‌ను, అధికారం చేతిలో ఉంది క‌దా..? అని ఐటీ, సీబీఐల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి చంద్ర‌బాబును ఇరికించాల‌ని చూస్తే నీ అంతు చూస్తానంటూ ప్ర‌ధాని మోడీని ముఖేష్ అంబాని ప‌రోక్షంగా హెచ్చ‌రించార‌ట‌. దీంతో, ప్ర‌ధాని మోడీ కిమ్మ‌న‌కుండా ఉండిపోయార‌ని, ఏపీపై ఎన్నికుట్ర‌లు చేసినా స‌మ‌యం వృధా త‌ప్పా... ఫ‌లితం లేకుండా పోతుంద‌నే భావ‌న‌లోకి వ‌చ్చార‌న‌ట ప్ర‌ధాని మోడీ.