//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొమ్మిదేళ్లుగా ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా!

Category : business

దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ తొమ్మిదేళ్లుగా ఒకే వేతన శ్రేణి ద్వారా అందే మొత్తాన్నే పొందుతున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆయన పొందిన వార్షిక వేతనం రూ.15 కోట్లు పొందగా 2016-17 సంవత్సరంలోనూ ఆయన అదే జీతాన్ని తీసుకుంటున్నారు. ఇతర భత్యాలతో కలిపి ముకేష్ ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్నారు.

రిలయన్స్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయనకు రూ. 38.75 కోట్ల వార్షిక వేతనం ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అయితే ఆయన ఆ మొత్తాన్ని పక్కనబెట్టి తొమ్మిదేళ్లుగా అన్ని భత్యాలు కలిపి రూ.15కోట్లు స్వీకరిస్తున్నారని సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెప్పింది. సీఈవోల జీతాభత్యాలు అదుపులో ఉండాలని 2009 అక్టోబర్ లో చర్చ జరిగినప్పుడు ముకేష్ తన జీతంపై తానే నియంత్రణ విధించుకున్నారు.