//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ పై మండిపడ్డ ముద్రగడ...!

Category : politics

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. ఆదివారం గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ ప్రసంగిస్తూ... వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం కరెక్టు కాదన్నారు.

మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం... ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అంటూ జగన్‌ను ముద్రగడ ప్రశ్నించారు. అలాగే మా డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ అన్నారు.