భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ధోనీకి పెంపుడు జంతువులన్నా, మోటార్ బైక్లన్న అమితమైన ఇష్టం. ఈ విషయం మరోమారు ఇపుడు నిరూపితమైంది. తన పెంపుడు కుక్క 'శామ్'తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ అనుకరించే టాలెంట్ అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పినట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుకరించడం చూడండి.