//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పద్మభూషణ్ కి 'ధోనీ'ని సిఫార్సు చేసిన బీసీసీఐ

Category : sports

దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరుని బీసీసీఐ బుధవారం సిఫార్సు చేసింది. ఇటీవల 300 వన్డేల మైలురాయిని అందుకున్న ధోనీ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 వన్డే అర్ధశతకాలు, 101 స్టంపౌట్స్‌తో అరుదైన రికార్డులను నెలకొల్పాడు. కెప్టెన్‌గా కూడా భారత్‌కి 2007లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించి విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు.

మహేంద్రసింగ్ ధోనీ పేరుని పద్మభూషణ్ కోసం బీసీసీఐ సిఫార్సు చేసింది. సభ్యులందరూ ధోనీ పేరుని ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ కంటే మెరుగైన క్రికెటర్ భారత్‌లో ఇక ఎవరు ఉంటారు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కెరీర్‌లో 302 వన్డేలు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల ధోనీ.. 9,737 పరుగులు చేయగా.. 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 78 టీ20ల్లో 1,212 రన్స్ చేశాడు. ఇందులో 6 టెస్టు శతకాలు, 10 వన్డే శతకాలు ధోనీ ఖాతాలో ఉన్నాయి.

Related News