//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంఎస్ ధోనీ కొత్త అవతారం....!

Category : sports

గత కొన్ని రోజుల ముందు వరకు వాణిజ్య ప్రకటనల రారాజుగా పేరొందిన టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ జోరు కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది . దానికి కారణం ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని అవకాశాలను అందిపుచ్చుకోవటమే .

అయినా కూడా ధోనీ క్రేజ్‌ను కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటున్నాయి. సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని వచ్చిన మిస్టర్ కూల్ కొత్త గెటప్‌లో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు . శ్రీలంకలో రేపటి నుంచి జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే .

తనకు దొరికిన సమయాన్ని ఓ చాక్లెట్ యాడ్‌లో నటించేందుకు అతను ఉపయోగించుకున్నాడు. ఈ యాడ్ లో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు . క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎలాగైతే పొడవాటి జుత్తుతో ఉండేవాడో అలాంటి గెటప్‌లోనే ఈ యాడ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ గెటప్ బాగుందంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు.

Related News